నిన్న విడుదల అయిన సినిమాల కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే..!

తెలంగాణ ప్రభుత్వం తో పోల్చితే ఏపీ ప్రభుత్వం వారు తెలుగు సినిమా పరిశ్రమను చిన్న చూపు చూస్తున్నారని.

ప్రతి విషయంలో కూడా సినిమా పరిశ్రమను జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుంది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలా అయితే టికెట్ల రేట్లు ఉన్నాయో అలాగే పెంచేందుకు గాను ఏపీ ప్రభుత్వం సిద్దం అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఏపీ లో అతి తక్కువగా టికెట్ల రేట్లు ఉండటం వల్ల కనీసం అక్కడ సినిమాలను విడుదల చేయడం కూడా సాధ్యం కావడం లేదు అంటూ ఇటీవల సురేష్‌ బాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి పదే పదే రిక్వెస్ట్ చేయడం వల్ల థియేటర్లలో రేట్లను పెంచేందుకు ఓకే చెప్పారు.

"""/"/ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఎలా అయితే థియేటర్లకు పలు రాయితీలు ఇచ్చారో అలాగే ఏపీలో కూడా అమలు చేయాలని భావిస్తున్నారట.

టికెట్ల రేట్లు పెంచుకోవడంతో పాటు థియేటర్ల కరెంటు విషయంలో రాయితీ ఇవ్వడం ఇంకా పన్ను రాయితీలను ఇవ్వడం వల్ల సినిమా పరిశ్రమను బతికించిన వాళ్లం అవుతామనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు.

అందుకే సినిమా నిర్మాతలు మరియు బయ్యర్ల కోరిక మేరకు టికెట్ల రేట్లను దాదాపుగా 30 నుండి 60 శాతం పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించబోతున్నారు.

అంతే కాకుండా కొత్త సినిమాలు వస్తేవెంటనే థియేటర్ల వద్ద టికెట్ల రేట్ల విషయంలో మార్పు చేసుకునే అవకాశం ఉకూడా కల్పించబోతున్నారు.

పెద్ద సినిమాలు కొత్త సినిమాల సమయంలో టికెట్ల రేట్లు వారం పాటు డబుల్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట.

 ఆగస్టు నుండి విడుదల అవ్వబోతున్న సినిమాలకు ఏపీలో మంచి వసూళ్లకు కొత్త రేట్లు ఉపయోగపడతాయని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ చేసే ఈ మూడు సినిమాల్లో ఏది బ్లాక్ బస్టర్ అవుతుందంటే..?