ఓటర్ స్లిప్ తరహాలో ఏపీ ప్రభుత్వం సరికొత్త యాక్షన్ ప్లాన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి వ్యాక్సిన్ కేంద్రాల వద్ద భారీగా జనాలు గుమ్మి గుడుతున్నారు.

వ్యాక్సిన్ డోస్ లు తక్కువ ఉన్నా కానీ ఎవరికి వారు కరోనా భయంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి తెగ తొందర పడుతున్నారు.

అయితే ఈ పరిణామంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద నుండి మరింత వైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో తాజాగా ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో సరికొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.

మేటర్ లోకి వెళ్తే ఓటర్ స్లిప్ తరహాలో వ్యాక్సిన్ స్లిప్ అందించడానికి సిద్దమైంది.

ఈ నేపథ్యంలో నేడు, రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ నిలిపివేత చేసింది ప్రభుత్వం.

రోజు ఉన్న కొద్ది వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ తోపులాట ఉండటంతో వ్యాక్సిన్ స్లిప్పు లు ద్వారా అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఎవరికి ఏ టైంలో వ్యాక్సిన్ వేస్తారో స్లిప్పుల ద్వారా ఇంటి వద్దకే సమాచారాన్ని పంపిస్తుంది.

గ్రామీణ ప్రాంతాలలో ఏఎన్ఎం ల ద్వారా స్లిప్ ల కార్యక్రమం పంపిణీ చేయనుంది.

అర్బన్ ప్రాంతాలలో అయితే ఎస్ఎంఎస్ల ద్వారా పంపించడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. .

అన్నల కంటే కూడా తమ్ముళ్లె బెటర్ అని అనిపించుకుంటున్న టాలీవుడ్ హీరోలు !