పవన్ చంద్రబాబు !  అమరావతి పై పొలిటికల్ హీట్ పెంచుతారా ? 

మరికొద్ది నెలల్లోనే జరగబోతున్న ఏపీ ఎన్నికలపై టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అధికార పార్టీ వైసీపీని ఎదుర్కునేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తూ.పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

దీనిలో భాగంగానే జనసేన , టిడిపి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లడంతో పాటు,  పవన్ చంద్రబాబు కలిసి ఇక కీలకమైన అంశాలపై పోరాటాలు చేయడం , బహిరంగ సభలు నిర్వహించడం వంటివి చేపట్టేందుకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు.

ఏపీలో పొలిటికల్ హీట్ పెంచి దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనేక వ్యూహాలను అమలు చేస్తున్నారు.

ముఖ్యంగా ఏపీలో ప్రధాన సమస్యగా మారిన  అమరావతి రాజధాని వ్యవహారం పైన మరింతగా పోరాటాన్ని ఉదృతం చేసి  తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు .

వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు రాజధానులపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన తర్వాత అమరావతి ఉద్యమం ఏపీలో మొదలైంది .

ఈ ఉద్యమానికి ఈనెల 17 నాటికి నాలుగేళ్లు అవుతోంది.ఈ సందర్భంగా ఆ తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్ లో అమరావతి పరిరక్షణ సమితి , అమరావతి రాజధాని ఐకాసా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సభ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గుంటూరు పోలీసులకు దరఖాస్తు చేశారు.

అమరావతి రాజధాని అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రజలలోకి ఎన్నికలలో అదే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్లేందుకు టిడిపి,  జనసేన నిర్ణయించుకున్నాయి.

టిడిపి,  జనసేన ఉమ్మడి కార్యాచరణ తరువాత  రెండు పార్టీల అగ్ర నేతలు పైకి రాబోతున్నారు.

ఈ సభకు వైసిపి మినహా అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నారు.అలాగే వివిధ కుల సంఘాలు , మేధావులను ఆహ్వానిస్తున్నారు.

"""/" / ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సభను నిర్వహించనున్నారు.

దీంతో ఈ సభలో ఏ అంశాలపై మాట్లాడాలి అనే దానిపై టిడిపి,  జనసేన అధినేతలు దృష్టి సారించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల అమరావతి రైతుల పోరాటాలు , నిర్బంధాలు,  కష్టాలు , పోలీసుల వేధింపులు తదితర అంశాలపై ఓ పాటను రూపొందించారు.

ఈ అమరావతి అంశాన్ని మరింత జనాల్లోకి తీసుకు వెళ్ళే విధంగా జనసేన , టిడిపిలు చేస్తున్న ఇతర సభలు,  ఉద్యమాలు , ఆందోళన కార్యక్రమాలు ఏపీ జనాల్లో ఎంతవరకు ప్రభాతం చేస్తాయో చూడాలి.

ఎన్టీఆర్ పై ఆరోపణలు… అలా చేస్తే హీరోలు అడుక్కు తినాల్సిందే.. ఫైర్ అయిన నటి!