ఆ తేదీకి ఆంధ్రాలో అంతా బాగుంటుందా.. టాలీవుడ్ కి మంచి రోజులు వచ్చినట్టేనా?
TeluguStop.com
ఏపీలో గత కొద్ది రోజులుగా టికెట్ వ్యవహారం గురించి చర్చలు, వాదోపవాదాలు, వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే.
ఒకవైపు టికెట్ల వ్యవహారం, మరొక వైపు కరోనా మహమ్మారి ఈ రెండింటి టాలీవుడ్ సినీ పరిశ్రమ అతలాకుతలం అవుతోంది.
ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్టులు అన్నీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇక పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే ఆయా సినిమాలకు సంబంధించిన కొత్త విడుదల తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇంకొందరు విడుదల తేదీలను ప్రకటిస్తూనే ఉన్నారు.ఏదేమైనప్పటికీ ఏపీలో మళ్లీ సందడి మొదలైంది అని చెప్పవచ్చు.
కానీ అందరి లోనూ ఒకటే టెన్షన్ ఉంది.అదే ఏపీలో టికెట్ల వ్యవహారం.
ఏపీలో టికెట్ రేట్ పెంచుతారా? తగ్గిస్తారా? అన్న ప్రశ్న అందరినీ కలవర పెడుతోంది.
ఇక సినీ ఇండస్ట్రీలోని కొంత మంది పెద్దల సమాచారం ప్రకారం.మార్చి ఒకటి అంత ఆంధ్రప్రదేశ్ లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని తెలుపుతున్నారు.
ఏపీ ప్రభుత్వం ఈ టికెట్ రేట్ల వ్యవహారాల గురించి, సినిమా థియేటర్స్ గురించి పెద్దగా పట్టించు కోకుండా వదిలేసింది అని తెలుపుతున్నారు.
ఈలోపే సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవి ని పిలిచి ఇదే విషయాన్ని ఆయనకు చెబుతారు అని తెలుపుతున్నారు.
"""/" /
ఈసారి జగన్ పిలిచినప్పుడు కేవలం చిరు మాత్రమే కాకుండా మరి కొంత మంది సినీ పెద్దలు కూడా వెళ్ళవచ్చు అని సమాచారం.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలమైన సందేశాలు ఇచ్చిన అందువల్లే దర్శక నిర్మాతలు అందరూ విడుదల తేదీలను ప్రకటించారు అని సమాచారం.
ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల పరిస్థితులు మార్చి ఫస్ట్ కన్నా ముందు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు అని కూడా సినీ పెద్దలు చెబుతున్నారు.
"""/" /
ఇదే విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.
టికెట్ రేట్లు వ్యవహారంపై తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలు చేయవద్దని తెలిపారు అని కూడా అంటున్నారు సినీ పెద్దలు.
మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ అంటున్న బిగ్ బాస్ షో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?