ఆ ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..!

హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.2024 జూన్ వరకూ ఉచిత వసతితో పాటు ట్రాన్సిట్ వసతి కల్పిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

సచివాలయం, హెచ్ఓడీలు, హైకోర్టు మరియు రాజ్ భవన్ ఉద్యోగులకు వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించిన వసతిని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు వసతి సదుపాయాన్ని ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు పొడిగించిన సంగతి తెలిసిందే.

చివరగా గత సంవత్సరం సెప్టెంబర్ లో ఆ ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని జూన్ 2023 వరకు పొడిగించింది.

తాజాగా ఆ గడువునే 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రెమ్యునరేషన్ ను రెట్టింపు చేసిన హీరోయిన్ కీర్తి సురేష్.. పారితోషికం ఎంతంటే?