ఆ విద్యా సంస్థల పై కొత్త జీవో ను తీసుకొచ్చిన ఏపీ సర్కార్..!
TeluguStop.com
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం విషయం పట్ల ఇరు పార్టీ రాజకీయ పక్షాలలో అగ్గిరాజేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో ఎయిడెడ్ విద్యా సంస్థల విలీన అంశం హాట్ టాపిక్ గా మారింది.
అలాగే విద్యాసంస్థల విలీనం విషయంలో కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
ఈ క్రమంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ అంశం పట్ల కొత్త జీవో జారీ చేసింది.
ఈ నేపథ్యంలో విద్యా సంస్థల విలీనానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది.
తమకు ఉన్న ఆస్తులతో సహా సిబ్బందిని, అలాగే కేవలం సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న యాజమాన్యాలు కూడా ఇప్పుడు మళ్ళీ అవసరం అయితే తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పించిందని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మెమో జారీ చేశారు.
కాగా ఏపీ లో 2,249 ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 68.78% విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించాయని, అలాగే 702 ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని ప్రభుత్వం తెలిపింది.
అయితే విలీనానికి అంగీకరించని ఎయిడెడ్ సంస్థలపై ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకుని రాలేదని ఉన్నత విద్యాశాఖ మరొకమారు స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే విలీనానికి నాలుగు ఆప్షన్లను ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యం కు తెలుపుతున్నామని చెప్పారు.
స్కూల్స్, జూనియర్, డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీలకు కలిపి ఈ మెమోను జారీ చేసారు.
మరి ఆ నాలుగు ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దామా. """/"/
మొదటి అప్షన్ కింద ఎయిడెడ్ విద్యాసంస్థలు తమ ఆస్తులు, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందితో సహా విలీనానికి ఒప్పుకోవడం.
ఇక ఆప్షన్-2 విషయానికి వస్తే కేవలం ఆస్తులు మినహా ఎయిడెడ్ సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి అంగీకరించడం.
అంటే ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లుగా కొనసాగుతాయన్నమాట.అలాగే ఆప్షన్-3 లో ఏ రకమైన విలీనానికి ఒప్పుకోకపోతే ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగడం.
ఇక చివరిగా ఆప్షన్-4 లో అంతకముందు విలీనానికి అంగీకీరించిన సంస్థలు మళ్ళీ వెనక్కు తీసుకోవాలంటే తీసుకోవచ్చు.
ఈ నిర్ణయం పట్ల విద్యాసంస్థలపై ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడిని తీసుకురాదు.పైన తెలిపిన ఆప్షన్లను కచ్చితంగా పాటించాలని అధికారులకు ప్రభుత్వం సూచనలు చేసింది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్28, శనివారం 2024