వాలంటీర్ల విషయంలో సస్పెన్స్ .. వాటిని తొలగించాలంటూ ఆదేశాలు 

ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను( Volunteer System ) కొనసాగిస్తుందా రద్దు చేస్తుందా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఏపీలో ఎన్నికలకు ముందు టిడిపి( TDP ) అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందని,  ఈ వ్యవస్థ సక్రమంగా కొనసాగాలంటే మళ్ళీ వైసిపి నే గెలిపించాలంటూ పదే పదే వైసిపి అధినేత జగన్( YS Jagan ) ఎన్నికల ప్రచారంలో జనాలకు విజ్ఞప్తి చేశారు.

దీనికి కౌంటర్ గా టిడిపి కూటమి పార్టీలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు , 5000 గా ఉన్న వారి గౌరవ వేతనాన్ని 10 వేలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో వాలంటీర్ వ్యవస్థ విషయంలో టిడిపి మాట నిలబెట్టుకుంటుందా లేక ఈ వ్యవస్థను రద్దు చేస్తారా అనే విషయంలో ఏ క్లారిటీ రావడం లేదు.

"""/" / ఈ విషయంలో టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) సైతం ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు .

అయితే వాలంటీర్ల సంఖ్యను బాగా కుదిరిస్తారని ప్రచారం జరుగుతోంది.అసలు వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

ఈనెల ఏడో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

"""/" / ఇక వాలంటరీ సేవల విషయంలో తాజాగా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు పథకాలు , నిర్ణయాలను ప్రజలకు చేరవేసేందుకు వాట్సాప్ , టెలిగ్రామ్ గ్రూపులను ఏర్పాటు చేశారు.

తమ క్లస్టర్ పరిధిలోని లబ్ధిదారులతో ఈ గ్రూపులను కొనసాగించారు .వాలంటీర్లు నిర్వహించిన అన్ని గ్రూపులను తక్షణమే తొలగించాలని వార్డు గ్రామ సచివాలయాలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

క్షేత్రస్థాయిలో వెంటనే ఈ ఆదేశాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు .

అంతేకాదు తొలగించిన గ్రూపుల వివరాలను సాయంత్రం లోపు ఇవ్వాలని సూచించారు.

కంగువా మూవీకి జ్యోతిక రివ్యూ.. భర్త సినిమా కాకపోతే ఆమె ఇలా స్పందించేవారా?