జగన్ ను చుట్టుముట్టిన ' కరోనా' కష్టాలు 

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు గా అయ్యింది ఏపీ పరిస్థితి.ఇప్పటికే ఆర్థికంగా ఏపీ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది.

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది.గత టీడీపీ ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేయడంతో పాటు,  ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసి మరీ ఎన్నికల ముందు జనాలకు తాయిలాలు పంచిపెట్టారు.

ఇక ఖాళీ ఖజానా వెక్కిరిస్తున్న సమయంలోనే జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.

ఎన్నో భారీ ఆర్థిక వ్యయం అయ్యే పథకాలను ప్రకటించారు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, జగన్ మాత్రం సంక్షేమ పథకాలను నిలుపుదల చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.

ఎక్కడ దొరికితే అక్కడ కొత్తకొత్త అప్పులు చేస్తూనే  సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు.

గత ఏడాది కరోనా కష్టకాలం ముంచెత్తినా, జగన్ మాత్రం తన సంక్షేమ పథకాలు నిలుపుదల చేయలేదు.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా నడుస్తుంది.ఇప్పుడు జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు.

అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి మాత్రం పూర్తిగా చిన్నాభిన్నం అయ్యింది.మొదటి దశ కరోనా వైరస్ ఉద్ధృతం అయిన సమయంలో రాష్ట్రాలకు కేంద్రం తగిన ఆర్థిక సహాయం అందించింది.

కానీ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి.టీకా లతో  పాటు కరోనా పెరిగితే లాక్ డౌన్ విధించుకునే వెసులుబాటు  కేంద్రం రాష్ట్రాల కి ఇచ్చింది.

దీంతో ఆర్థికంగా రాష్ట్రాలకు మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆర్ధికంగా ఫర్వాలేదు అనుకున్న రాష్ట్రాలకు ఇబ్బందులు లేకపోయినా, ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న ఏపీ వంటి రాష్ట్రాలకు ఇప్పుడు కరోనా కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

కొత్తగా అప్పులు చేద్దామంటే ఎక్కడ దొరకని పరిస్థితి.ఇప్పటికే దొరికిన చోటల్లా అప్పులు చేసి మరీ ఏపీ లో ప్రభుత్వాన్ని జగన్ నడిపిస్తున్నారు.

ఇప్పుడు పూర్తిగా ఏపీలో లాక్ డౌన్ విధించకుండా కొంత వెసులుబాటు కల్పించారు.పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తే ఆర్థిక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో జగన్ కు బాగా తెలుసు.

"""/"/ ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో ఏపీని ఏ విధంగా జగన్ రోడ్డును పడేస్తారు అనే విషయంపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

కొత్త అప్పులు దొరకని ఈ సమయంలో ఏపీలో సంక్షేమ పథకాలతో వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండడం, కరోనా కారణంగా ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం, ఇలా ఎన్నో అంశాలు జగన్ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది నిరూపించబోతున్నాయి.

US Airport : యూఎస్ ఎయిర్‌పోర్ట్‌లోని ఈ బ్యాగేజీల గజిబిజి చూశారా.. వీడియో వైరల్..