ఏపీ ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు..: మంత్రి అంబటి

నాగార్జున సాగర్ డ్యాంపై తాము చేసిన చర్య ధర్మమైనదేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

ఇది తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన సున్నిత అంశమని పేర్కొన్నారు.ఏపీ ప్రభుత్వం ఏ తప్పు చేయలేదన్న మంత్రి అంబటి కొందరు రెచ్చగొట్టి గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు అసమర్థత వలనే తెలంగాణ ప్రభుత్వం ఏపీలో చెక్ పోస్ట్ పెట్టిందని మండిపడ్డారు.

ఏపీకి నీళ్లు విడుదల చేయాలంటే తెలంగాణ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందన్నారు.ఏపీ ప్రభుత్వం భూభాగంలోకి ఏపీ పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు.

కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అలాగే అసెంబ్లీ ఎన్నికలపై స్పందించిన ఆయన తెలంగాణలో తమ రాజకీయ పార్టీ లేదన్నారు.

ఈ క్రమంలో తెలంగాణలో ఏ పార్టీ గెలిచినా తమకు సంబంధం లేదని చెప్పారు.

ఏ పార్టీని గెలిపించాల్సిన అవసరం లేదన్న మంత్రి అంబటి ఓడించాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు.

బాలయ్యకు ఇవ్వడం ఓకే.. వీళ్లకెందుకు పద్మ పురస్కారాలు ఇవ్వడం లేదు?