సచివాలయ ఉద్యోగస్తులకు కొత్త పనులు అప్పజెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పాలనలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రజలకు సంబంధించి పథకాలు ఇంకా అనేక పనులు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు అందేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అదనపు బాధ్యతలు సచివాలయ ఉద్యోగస్తులకు ఏపీ ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది.

విషయంలోకి వెళ్తే ఎన్నికలు, ఇతర బోధనేతర పనులకు ఉపాధ్యాయులను ఏపీ ప్రభుత్వం నిషేధించడం తెలిసిందే.

ఈ క్రమంలో ఆ పనులకు 1.30 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని తాజాగా నిర్ణయించుకుంది.

అయితే పాఠశాల ఆవరణలలో పరిశుభ్రత వంటి పనులు విధుల్లో ఒక భాగమేనని స్పష్టం చేయడం జరిగింది.

దీన్ని భూతద్దంలో చూడొద్దనిమంత్రి చెల్లుబోయిన మీడియాకు సూచించడం జరిగింది.గతంలో ఎన్నికలు పనులు ఉపాధ్యాయులు నిర్వహించేవారు.

అయితే ఇప్పుడు కొత్తగా సచివాలయ ఉద్యోగస్తులకు అప్పజెప్పడం సంచలనంగా మారింది.

నయనతార ప్లాస్టిక్ సర్జరీ వార్తల్లో అసలు నిజం ఇదే.. మార్పులకు కారణాలివేనంటూ?