ఏపీ ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పు..!

తెలంగాణాలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయగా ఏపీలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.

ఏపీలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు సూచించారు.ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలుగా నిర్ణయించారు.

ఈ నెల 30 వరకు కర్ఫ్యూ కొనసాగుతుండగా అప్పటివరకు ఇవే పనివేళలు ఉంటాయని సీఎస్ ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు.

పనివేళల మార్పుని సూచిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు, అన్ని విభాగాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు అయితే రాష్ట్రంలో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడ సడలింపులు ఇవ్వలేదు.

అక్కడ మధ్యాహ్నం వరకు మాత్రమే సడలింపు ఉంది.అక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పనిచేస్తారని తెలిపారు.

ఏపీలో మొన్నటివరకు రోజుకి 10 వేలు తగ్గకుండా కేసులు రాగా క్రమంగా కేసులు అదుపులోకి వచ్చాయి.

ప్రస్తుతం అక్కడ రోజుకి 5 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి.అందుకే ఏపీలో ఇంకా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది.

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతున్నా సరే కరోనా కంట్రోల్ అయ్యే వరకు లాక్ డౌన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

వీడియో: యూఎస్ గ్రాడ్యుయేషన్ సెర్మోనీలో రెపరెపలాడిన ఆర్‌సీబీ ఫ్లాగ్..