జగన్ పాలన వీరికి నచ్చడం లేదా ? దెబ్బకొడతారా ? 

ఏపీలో జగన్ పరిపాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వ్యవహరించిన తీరు, ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పరిపాలన తీరు, ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఎన్నో హామీలను ఇచ్చారు.వాటిలో చాలా వరకు విజయవంతంగా అమలు చేసినా, కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం జగన్ నాన్చివేత ధోరణి అవలంభిస్తూ వస్తుండడం, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కనిపించకపోవడం తదితర కారణాలు జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి కారణం అవుతున్నాయి.

ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు జగన్ పరిపాలనపై అసంతృప్తితో ఉన్నట్లు గా కనిపిస్తున్నారు.ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాకులు మాటల్లో ఈ విషయం బయటపడుతుంది.

ఉద్యోగ సంఘాల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఆ వర్గంలో ఉంది.

దీనిపై బహిరంగంగా గళం విప్పేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.గత టిడిపి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరించడం, కఠిన నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాలతో టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు పని చేశాయి.

డీఏ అలవెన్సులు మాత్రమే కాకుండా, ఉద్యోగులపై అదనపు పని భారం మోపారని తీవ్ర అసంతృప్తితో టిడిపి కి వ్యతిరేకంగా వ్యవహరించడం తదితర కారణాలు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఒక కారణం అయ్యాయి.

అంతేకాకుండా ఏపీలో సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేస్తామని జగన్ హామీ ఇవ్వడం తదితర కారణాలతో 2019 ఎన్నికల్లో వైసీపీ కి అనుకూలంగా ఉద్యోగ సంఘాలు పని చేశాయి.

"""/"/ అయితే ఇప్పుడు సిపిఎస్ విధానంపై జగన్ నాంచివేత ధోరణి అవలంబిస్తూ ఉండడం, సరైన సమయానికి జీతాలు అందకపోవడం, ఎన్నికల ముందు ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కనిపించకపోవడం ఇలా ఎన్నో కారణాలతో  ఈ వ్యతిరేకత కనిపిస్తోంది.

ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎన్జీవోలు ఈ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారు.పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో వైసిపి కి మరిన్ని ఇబ్బందులు ఎదురురవడంతో పాటు , ఎన్నికల్లో ఫలితాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

భద్రాద్రి జిల్లాలో గన్ మిస్ ఫైర్ .. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి