మీరే నేను అంటున్న జ‌గ‌న్‌.. మ‌రీ ఇంత త‌గ్గిపోయారేంటి..?

పీఆర్‌సీ ప‌ట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేత‌లు ఆక్రోషితులై విజ‌య‌వాడ‌లో ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం విధిత‌మే.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డిపై అనేక కామెంట్లు కూడా చేశారు.

అలాంటి వారితోనే మూడు రోజుల్లోనే సీఎం మా సారు అంటూ.ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపిస్తున్నారు.

ఇలా ఉద్యోగ సంఘాల నేత‌లు జ‌గ‌న్ ప‌ట్ల ఫిదా అవుతార‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు.

ప్ర‌స్త‌తుం జ‌గ‌న్‌ను మా సార్ చాలా మంచో డంటూ ఉద్యోగులు తెగ పొగిడేస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు త‌లెత్తుతున్నా, ఆర్థిక ప‌రిస్థితులు స‌రిగా లేకున్నా మేం కోరిన వాటిన్నంటికీ జ‌గ‌న్ ఓకే అన్నారంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

కృత‌జ్ఞ‌తాభావంగా ఉద్యోగులు సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపారు.మాకు పీఆర్‌సీలో నూత‌న స‌వ‌ర‌ణ‌లు చేసి మేం అడిగింది చేశార‌ని సంబుర ప‌డుతున్నారు.

ఇందుకు సీఎం జ‌గ‌న్ కూడా త‌న‌దైన శైలిలో స్పందించారు.ఒకానొక ద‌శ‌లో ఎగ్జైట్‌మెంట్‌కు గురయ్యాడు కూడా.

ఈ ప్ర‌భుత్వం మీదే.మీరు లేకుంటే నేను లేను.

మీరంటే నేను.నేనంటే మీరు అంటూ చెప్ప‌డంతో ఉద్యోగ సంఘాల నేత‌లు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

ఎలాంటి స‌మ‌యాల్లోనూ భావోద్వేగాల‌కు గురి కావ‌ద్ద‌ని, ఏదైనా చెప్ప‌ద‌ల్చుకుంటే నేరుగా ప్ర‌భుత్వంతో చెప్పుకోవ‌చ్చ‌ని సూచించారు.

"""/" / నేను మీకు ఇవ్వ‌గలిగిందంతా ఇచ్చాను.ఇంకా ఇవ్వాల‌నే త‌న‌కు ఉంద‌ని వివ‌రించారు.

క‌రోనా సంక్షోభంతో పాటు ఆర్థిక స‌మ‌స్య‌ల వ‌ల్ల ఇవ్వ‌లేక‌పోతున్న‌ట్టు చెప్పారు.భ‌విష్య‌త్‌లో అవ‌కాశం వ‌స్తే జ‌గ‌న్ కంటే ఏ సీఎం ఉద్యోగుల‌కు చేయ‌లేడ‌నేలా చేస్తాన‌ని హామీకూడా ఇచ్చారు.

మ‌రోవైపు సీపీఎస్ ర‌ద్దు విష‌యంలోనూ జ‌గ‌న్ మంచి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పడం ప్ర‌స్తుతం చ‌ర్చ‌ణీయాంశంగా మారింది.

మీరూ ప్ర‌భుత్వంలో భాగ‌మేన‌ని, మీతోటే ప్ర‌భుత్వం ఉంటుంద‌ని క‌నియాడారు.మీతోనే ఏ ప్ర‌భుత్వ కార్యక్ర‌మం జ‌ర‌గ‌ద‌ని పేర్కొన్నారు.

ఆ మాటలతోటే ఉద్యోగ సంఘాల నేత‌లు ఫుల్ హ్యాపీగా ఉన్నార‌ని స‌మాచారం.మొత్తంగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల‌తో ప్ర‌స్తుతం పెన‌వేసుకున్న ఈ బంధం భ‌విష్య‌త్‌లో ఎలా ఉంటుందో చూడాల్సిందే.

పొలాల్లో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ వింటేజ్ ఫోటోలో ప్రభాస్ లుక్ కు ఫిదా అవ్వాల్సిందే!