ఆరోగ్య శ్రీ పరిధిలో బ్లాక్ ఫంగస్.. ఎక్కడో తెలుసా..?

కరోనా మహమ్మారి విజృంభన ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే.రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూ ప్రజలను కష్టాల పాలు చేస్తుంది.

ఇక కరోనా నుండి ఎలాగోలా బయటపడ్డాం అనుకున్న వారికి కొత్తగా బ్లాక్ ఫంగస్ అని ఒకటి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుంది.

బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కరోనాతో పాటుగా బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్య శ్రీ పరిధిలో తీసుకువస్తున్నామని వెళ్లడించింది.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులపై దృష్టి పెట్టామని చెప్పారు.

సిఎం జగన్ బ్లాక్ ఫంగస్ పై కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.బ్లాక్ ఫంగస్ కారణంగా కరోనా రోగులు కంటిచూపు పోగొట్టుకుంటున్నారు అంతేకాదు కొన్ని కేసులు సీరియస్ కండీషన్ లోకి వెళ్లడమే కాకుండా మృతి చెందడం కూడా జరిగింది.

ఇక నుండి బ్లాక్ ఫంగస్ కూడా ఆరోగ్య శ్రీ కింద వస్తుందని అన్నారు.

ఇక కేసుల సంఖ్య పెరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా నిబంధనలు అనుగుణంగా ఉండాలని అన్నారు.

ఇప్పటికే గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే చేపడుతున్నారని ఆళ్ల నాని అన్నారు.

రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడం వల్ల కేసులు తగ్గాయని అన్నారు.

అందరికీ నమస్కారం ! నేను క్రాంతి ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని