ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా చాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి…. వెల్లువెత్తుతున్న విమర్శలు?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) ఒకరు.

ఇటీవల మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) అనే సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

అయితే ఇటీవల వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దూసుకుపోతున్న మీనాక్షి చౌదరికి ఏపీ ప్రభుత్వం ( AP Government ) బంపర్ ఆఫర్ ఇచ్చేశారు.

ఇలా ఏపీ ప్రభుత్వం మీనాక్షి చౌదరిని ఏపీ మహిళా సాధికారిక విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ ( Brand Ambassador ) గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

త్వరలోనే ఈమె ఈ బాధ్యతలను అందుకోబోతున్నారు. """/" / హీరోయిన్గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈమెకు ఇలాంటి గొప్ప బాధ్యతలు రావడంతో అభిమానులందరికీ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఒకవైపు ఈమె అభిమానులు మీనాక్షి చౌదరికి శుభాకాంక్షలు చెబుతుండగా మరికొందరు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

మీనాక్షి చౌదరికి ఈ బాధ్యతలు ఇవ్వటాన్ని కొంతమంది ఏమాత్రం స్వాగతించలేకపోతున్నారు. """/" / మీనాక్షి చౌదరి హర్యానాకు చెందిన అమ్మాయి.

ఇలా వేరే రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయిని ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం సరైది కాదని తెలుగులో కూడా ఎంతోమంది గొప్పవారు ఎంతో స్ఫూర్తిదాయకమైన మహిళలు కూడా ఉన్నారని అలాంటి వారికి ఇలాంటి బాధ్యతలు అప్పచెప్పకుండా ఇతర రాష్ట్రానికి చెందిన మీనాక్షి చౌదరికి ఈ పదవి ఇవ్వడం ఏంటి అంటూ మండి పడుతున్నారు.

ఏదేమైనా మీనాక్షి చౌదరి పదవి పై ఇప్పుడు.పెద్ద దుమారమే రేగింది.

మరి ఈ వివాదం పై ఏపీ ప్రభుత్వం అలాగే మీనాక్షి చౌదరి స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.