ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
సిట్ దర్యాప్తుపై సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
సిట్ దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు.దేశంలో భూమికి సంబంధించి అతిపెద్ద స్కామ్ బయటకు వస్తుందన్న ఆయన అరెస్ట్ లు కూడా కచ్చితంగా జరుగుతాయని పేర్కొన్నారు.
అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని సజ్జల పేర్కొన్నారు.స్కాం జరగపోయి ఉంటే చంద్రబాబు, ఆయన ముఠా ఎందుకు భయపడుతున్నారని సజ్జల ప్రశ్నించారు.
నిజానిజాలను వెలికి తీసేందుకే సిట్ ఏర్పాటు చేశామని తెలిపారు.
వైరల్ వీడియో: తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!