బారా షహీద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్లు

బారా షహీద్ దర్గా అభివృద్ధికి ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రొట్టెల పండుగా రోజు భ‌క్తుల‌కు తీపి క‌బురు అంద‌డంతో అందరు ఉత్సావాలు జ‌రుపుకున్నారు.

ద‌ర్గా అభివృద్ధికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చిత్త‌శుద్ధితో ఎంతో కృషి చేశార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

బారా షహీద్ దర్గా అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.దర్గా సమగ్ర అభివృద్ధికి 15 కోట్లు రూపాయిలు మంజూరు చేస్తూ వైసీపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కలెక్టర్ చక్రధర్ బాబు నివేదిక ఆధారంగా నిధులు మంజూరయ్యాయి.దర్గా ఆవరణలో కాంప్లెక్స్, అంతర్గత సిమెంట్ రోడ్లు, బంగారు చెరువు తదితర అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.

కలెక్టర్ నివేదిక ఆధారంగా ప్రజాప్రతినిధుల వినతి మేరకు బారాషాహిద్ దర్గా అభివృద్ధికి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అభివృద్ధి చేపట్టాల్సిన పనులపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో సమీక్షించి కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిసింది.

కోటంరెడ్డి సోదరులు ప్రత్యేకంగా ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జిల్లాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బారాషాహిద్‌ దర్గా ఆవరణలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు.

"""/" / దీంతో దర్గా అభివృద్ధి పనులకు 15 కోట్ల రూపాయిలు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రొట్టెల పండుగ నిర్వహిస్తున్న బారాషాహిద్ దర్గా అభివృద్ధికి 15 కోట్ల రూపాయిలు నిధులు కేటాయించినందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

దర్గా భక్తుడిగా రొట్టెల పండుగ శుభవార్త అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, దర్గా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశానని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో ఇది సాధ్యమైందని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల వేళ భువనగిరి బీజేపీలో గ్రూప్ వార్..!