పాఠశాలలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు దాదాపు పది వేలకు పైగానే గత కొద్ది రోజుల నుండి నమోదవుతున్నాయి.

ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాలలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

విషయంలోకి వెళితే ఉదయంపూట ప్రార్థనలు నిలిపివేయాలని ప్రభుత్వం సరికొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

అంత మాత్రమే కాక పాఠశాలలో గేమ్స్ నిర్వహించవద్దని.విద్యార్థులు పాఠశాలలో ఎక్కడా కూడా చూడకుండా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ప్రతి గంట గంటకు పాఠశాల తరగతి గదులను మరియు ఆవరణ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని స్పష్టం చేయడం జరిగింది.

విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు కరోనా బారిన పడితే వెంటనే చికిత్స అందించేలా జిల్లా వైద్య అధికారులు.

పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షించాలని ప్రభుత్వం కోరింది.తప్పనిసరిగా మాస్క్ తో పాటు భౌతిక దూరాన్ని పాటించేలా.

రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

 మరోపక్క కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రతిపక్షాలు రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటిస్తే బాగుంటుందని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఉన్నాయి.

ఆ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ రియల్ కాదా.. అదంతా సీజీ మహిమానా??