ఏపీ కరోనా అప్డేట్స్.. చిత్తూరు జిల్లాలో కోవిడ్ విజృంభన ఒక్కరోజే.. ?

కరోనా లెక్కలు మన దేశంలో క్రమక్రమంగా పెరుగుతున్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించ లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవడం తధ్యం అనే భయం ప్రజల్లో నెలకొంటుందట.

ఇకపోతే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ వివరాలు చూస్తే.

ఏపీలో గడచిన 24 గంటల్లో 35,443 కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 82 మందికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిందట.

ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా గుంటూరు జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 8, కృష్ణా జిల్లాలో 7 కేసులు చొప్పున నమోదు అయ్యాయని, ఇక విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

ఇదే సమయంలో 74 మంది కరోనా నుంచి కోలుకోగా ఈ రాష్ట్రంలో ఈ 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదట.

ఇకపోతే మొత్తం ఈ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,168 కాగా, పాజిటివ్ కేసులు 8,89,585 నమోదు అయ్యాయట.

కాగా 8,81,806 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకున్నారని, మరో 611 మంది చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిస్తుంది.

వీడియో వైరల్: అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో కాల్పులు