పాకిస్తాన్ చెరనుంచి బయటకొచ్చిన సిక్కోలు మత్స్యకారులు
TeluguStop.com

గత 13 నెలలుగా పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉన్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు మగ్గుతున్న సంగతి తెలిసిందే.


ఇక వీరిని విడిపించాలని వారి కుటుంబీకులు స్థానిక ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అందరిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.


ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పలు సార్లు విదేశాంగ మంత్రిని కలిసి మత్స్యకారులని పాక్ చెర నుంచి బయటకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఇక రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారు.
ఈ నేపధ్యంలో మత్స్యకారులకి విముక్తి లభించింది.గుజరాత్ లో చేపల వేటకకి వెళ్ళిన వీళ్ళు పొగమంచు కారణంగా తెలియకుండా పాక్ జలాశయాల్లోకి ప్రవేశించారు.
దీంతో పాక్ కోస్ద్ గార్డ్స్ వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.వీరిలో మొత్తం 15 మంది ఉన్నారు.
ఇక వీళ్ళందరిని రేపు వాఘా సరిహద్దు వద్ద శ్రీకాకుళం మత్స్యకారులను విదేశాంగ శాఖ అధికారులకు పాక్ అప్పగించనుంది.
పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కిన వారిలో డి.మత్స్యలేశం, కొత్త మత్స్యలేశం, శివాజీదిబ్బలపాలెం, బడివానిపేట గ్రామాలకు చెందిన వారు ఉన్నారు.
ఇక వాళ్ళు బయటకి వస్తున్నారని విషయం జిల్లాలో మత్స్యకారుల కుటుంబ సభ్యుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.