పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు.. !

పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు !

ఏపీ ప్రభుత్వం విద్యార్ధుల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.ఎందుకంటే కరోనా నేపధ్యంలో దాదాపుగా మిగతా రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులతో పాటుగా మిగతా తరగతుల వారిని ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు !

కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపింది.

పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు !

కానీ ఈ విషయంలో స్పందించిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా జూన్ 7 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నామని, త్వరలోనే ఇంటర్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకుంటామని, అయితే పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించడం మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఈ నిర్ణయం వెనక విద్యార్థుల భవిష్యత్తు ఉందని తెలిపారు.అయితే ఈ అంశం పై రాజకీయ పార్టీలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని, చదవకుండా, పరీక్షలు రాయకుండా పాస్ అయితే దానికి విలువ ఉండదని వెల్లడించారు.

అదీగాక ముఖ్యంగా రాష్ట్రంలో నిర్వహించే వివిధ ఎంట్రన్స్ టెస్టులతో పాటుగా, కేంద్ర స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ వంటి పరీక్షలకు కూడా ఈ మార్కులు అవసరమని తెలిపారు.