స్కూళ్లు మళ్లీ తెరిచేందుకు ఏపీ విద్యాశాఖ సంసిద్ధం..!

ఏపీ విద్యాశాఖ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది.ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ తెరిచేందుకు సంసిద్ధమవుతోంది.

కరోనా నేపథ్యంలో మూత పడిన స్కూళ్లు తిరిగి ప్రారంభించనుంది.స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తోంది.

సర్టిఫికెట్లు లేకుండా విద్యార్థులను స్కూళ్లలో జాయిన్ చేసుకోవడం, పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయడం, ట్రాన్ఫర్ల వంటి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

దీంతో ప్రభుత్వం స్కూళ్లు తెరిచే ఆలోచనలో ఉంది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు స్కూళ్లకి రావాల్సిన అవసరం లేదు.

కేవలం తల్లిదండ్రులు వస్తే చాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు.విద్యార్థులకు సంబంధించిన పూర్తి ప్రక్రియలను స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పూర్తి చేస్తారు.

టీసీలు జారీ, అడ్మిషన్లు తదితర అంశాలను తల్లిదండ్రుల సూచన మేరకే నిర్ణయాలు తీసుకుంటారు.

5,7 వ తరగతి చదువుతున్న విద్యార్థులు హై స్టడీస్, ట్రాన్ఫర్స్ కి సంబంధించి తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోనున్నారు.

దీనిపై ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యా శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో మార్గనిర్దేశం చేయనున్నారు.

అడ్మిషన్లకు సంబంధించి తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలి.స్కూళ్ల ప్రవేశాలు సజావుగా కొనసాగేలా ఎంఈవోలు, ఉప విద్యాధికారులు చర్యలు తీసుకోవాలి.

ఎలాంటి ధ్రువపత్రాలు అడగకుండా విద్యార్థులను అడ్మిషన్ చేసుకోవాలని విద్యాశాఖ పేర్కొంది.అక్టోబర్ 5 నుంచి ప్రారంభించాలని నిర్ణయించినా.

కరోనా నేపథ్యంలో ఆయా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ఏపీ విద్యాశాఖ పేర్కొంది.

ట్రంప్ ఆ ప్లాన్‌ ప్రకటించగానే.. నవ్వు ఆపుకోలేకపోయిన హిల్లరీ క్లింటన్!