ఏపీలో కరోనా టెర్రర్.. ఆ జిల్లాలో ఒక్కరోజే..!
TeluguStop.com
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్యా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు.
ఏపీలో కరోనా టెస్టులు భారీగా చేస్తున్నారు.టెస్టులు ఆ రేంజ్ లో చేస్తున్నారో అంతే స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
బుధవారం తాజగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ని విడుదల చేశారు.
ఏపీలో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 49,553 మందికి పరీక్షలు చేయగా అందులో ఏకంగా6,494 మందికి పాజిటివ్ వచ్చాయని వైద్యులు వెల్లడించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 64,713 కు చేరిందన్నారు.
అయితే రాష్ట్రములో గడచిన 24 గంటల్లో ఏకంగా 65 మంది చనిపోయారు.దీంతో మొత్తం మరణాల సంఖ్య 823కు చేరింది.
అయితే గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలులో ఐదుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, కృష్ణాలో 10 మంది, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 మంది, గుంటూరులో 15 మంది, చిత్తూరులో ఐదుగురు, కడపలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు మరణించారని సమాచారం.
ఇకపోతే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైన మొత్తం 64,713 కు పాజిటివ్ కేసులకు గాను 32,127 మంది డిశ్చార్జ్ కాగా మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని తెలియజేశారు.
ఇకపోతే రాష్ట్రంలో 31,763 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.గత 24 గంటల్లో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1,049 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి20, సోమవారం2025