దేశానికే ఆద‌ర్శంగా ఏపీ ఈ-క్రాప్

ఏపీలో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు అవుతున్న ఈ -క్రాప్ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

ఈ క్ర‌మంలో అగ్రిస్టాక్ డిజిట‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ పేరిట అన్ని రాష్ట్రాల్లో ఈ- క్రాప్ న‌మోదు చేయాల‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఈ-క్రాప్ విధానంలో ఏ ఊరిలో ఎన్ని ఎక‌రాల్లో ఏయే పంట‌లు వేశార‌న్న క‌చ్చిత‌మైన స‌మాచారం ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.

దీని ద్వారా వివిధ ప‌థ‌కాల అమ‌లు, న‌ష్ట‌ప‌రిహారం చెల్లింపు సుల‌భ‌త‌రం అవుతుంది.అయితే ఏపీలో గ‌త మూడేళ్లుగా ఈ ప‌థ‌కం అమ‌లు అవుతోంది.

ఈ నేప‌థ్యంలో ఈ-క్రాప్ విధానాన్ని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమ‌ల్లోకి తీసుకురావాల‌ని కేంద్రం చ‌ర్య‌లు చేప‌డుతోంది.

బాబాయ్ పవన్ ఫోన్ నెంబర్ ను నిహారిక ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?