నేడు ఏపీ ఈ -క్యాబినెట్ సమావేశం.. చర్చించే అంశాలు ఇవే
TeluguStop.com
ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం( AP Cabinet Meeting ) కానుంది .
సరికొత్త రీతిలో పేపర్ లెస్ విధానాన్ని అమలు చేస్తూ ఈ క్యాబినెట్ ను నిర్వహించ తలపెట్టింది.
2014 -19 మధ్య కాలంలోనూ ఈ క్యాబినెట్ విధానాన్ని అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు( CM Chandrababu ) అమలు చేశారు.
మళ్ళీ ఇప్పుడు అదే విధానాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు .
గత వైసిపి ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన రివర్స్ టెండర్ విధానాన్ని( Reverse Tendering ) రద్దు చేసే విషయం పైన చర్చించనున్నారు.
అలాగే గతంలో అమలులో ఉన్న సాంప్రదాయ టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరించేందుకు ఆమోదం తెలపనున్నారు.
"""/" /
దీంతో పాటు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పోలవరం( Polavaram ) ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6000 క్యూసెక్కులకు పెంచుతూ గతంలో ఇచ్చిన టెండర్ నిబంధనలకు అనుగుణంగా పనులకు అనుమతి ఇవ్వనున్నారు.
1226 .68 కోట్ల కు పాత కాంట్రాక్టర్లకే పనులు కొనసాగిస్తూ అనుమతించే విషయం పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు.
"""/" /
కొత్త ఎక్సైజ్ పాలసీ, ప్రొక్యూర్మెట్ పాలసీల పైన ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ పైన క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
రేషన్ బియ్యం సరఫరా చేసే ఎండియు వాహనాలను రద్దు చేసే అంశం పైన నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047 పై మంత్రివర్గంలో చర్చించునున్నారు.అలాగే పలు శాఖలకు సంబంధించిన ప్రధాన అంశాల పైన ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయం పైన ఈ సమావేశంలోనే చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న దేవర… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?