చింతమనేని పై ఉన్న కేసులు లెక్క బయటపెట్టిన ఏపీ డీజీపీ..!!

టీడీపీ నేత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై నమోదైన మొత్తం కేసుల సంఖ్య బయటపెట్టారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.

1995 నుండి ఇప్పటివరకు చింతమనేని ప్రభాకర్ పై మొత్తం 85 కేసులు నమోదు అయ్యాయని స్పష్టం చేశారు.

అప్పట్లో చంద్రబాబు హయాంలో వనజాక్షి అనే మహిళ ఎమ్మార్వో ను చింతమనేని జుట్టు పట్టుకొని కొట్టడం మాత్రమే కాక.

కాళ్ళతో తన్నడం జరిగింది.అప్పట్లో అది పెద్ద ఇష్యూ కూడా అయ్యింది.

సరిగ్గా ఈ కేసు 2019 ఎన్నికల ముందు ఫిబ్రవరి మాసంలో ఫాల్స్ కేస్ అని అప్పుడు క్లోజ్ చేసేసారు.

వనజాక్షి జుట్టు పట్టుకొని అప్పట్లో చింతమనేని కొట్టడం.అప్పట్లో అంత బయటపడ్డాయి అందరికి తెలుసు.

అంతేకాక చింతమనేని ప్రభాకర్ పై 1995 నుండి దాదాపు 17 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయని.

చరిత్ర మొత్తం చూస్తే వాస్తవాలే ఉన్నాయని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మొత్తం చింతమనేని కేసులు లెక్క తాజాగా బయటపెట్టారు.

ఇదిలావుంటే ఇటీవల చింతమనేని ప్రభాకర్ తనపై కావాలని పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నట్లు ఆరోపణలు చేయడం జరిగింది.

అంతేకాకుండా ఎన్ కౌంటర్ కి కూడా ప్లాన్ చేసినట్లు ఆరోపించారు.ఇటువంటి తరుణంలో ఏపీ డీజీపీ చింతమనేని కేసుల లెక్కలు బయట పెట్టడం సంచలనంగా మారింది.

కథ విషయంలో చిరంజీవి గెలుకుతూనే ఉంటారు.. డైరెక్టర్ బాబీ సంచలన వ్యాఖ్యలు?