మొదటిసారి బయటకు వచ్చిన పవన్ చిన్న కూతురు.. వైరల్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు.

ఇందులో భాగంగానే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ కాలినడకన అలిపిరి మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్లారు.

కాలినడకన అలిపిరి మార్గంలో పవన్ కళ్యాణ్ కు ఆహారాం సరిగా తీసుకోకపోవడంతో స్వల్ప అస్వస్ధకి గురయ్యారు.

అనంతరం కాసేపు అయ్యాక కోలుకునట్టు సమాచారం.తిరుమలలో పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ సంతకం పెట్టి దర్శనానికి వెళ్లినట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పలీనా అంజని కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినట్లు సమాచారం.

ఇందులో భాగంగానే పవన్ కూతురు పలీనా అంజని కూడా శ్రీవారి దర్శనానికి టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు.

"""/" / టీటీడీ ఉద్యోగులు తీసుకొనే వచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.

పలీనా అంజని( Palina Anjani ) మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేసారు.

పలీనా అంజని క్రిస్టియన్ అవ్వడంతో టీటీడీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి వెళ్లినట్లు సమాచారం.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

"""/" / పాలిన అంజనీ చిన్నవయసులో మీడియాకు కనపడింది.చాలా రోజుల అనంతరం మీడియా ముందుకు వచ్చింది.

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ వ్యవహారం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న సంగతి అందరికీ వివిధమే.

ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసమే పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకున్నారు.దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం దీక్ష పవన్ కళ్యాణ్ వీడుతారు.

ఇక ఇద్దరు కూతుళ్లతో కలిసి పవన్ కళ్యాణ్ మొదటిసారి కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

ఆద్య, పలీనా అంజని( Aadhya ) ఒకేలా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

దర్శనం అనంతరం అన్నప్రసాదాల తయారిని పరిశీలన చేయబోతున్నట్టు సమాచారం.

అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడా..? ఆయనను జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం….