తిరుమలకు పవన్ కళ్యాణ్… ఆ సభపై అందరిలోనూ టెన్షన్

జనసేన అధినేత,  ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( AP Deputy CM Pawan Kalyan ) తిరుమల పర్యటన ఆసక్తికరంగా మారింది.

ఈరోజు పవన్ తిరుమలకు( Tirumala ) రాబోతూ ఉండడం తో తిరుపతిలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తి నెయ్యి ఉపయోగించారని టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించడం , దీనిపై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఆ దీక్షను విరమిస్తానని దీక్ష ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

దీక్ష విరమించేందుకు పవన్ కళ్యాణ్ తిరుమల కు ఈరోజు వస్తున్నారు.ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయానికి పవన్ చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అలిపిరికి చేరుకుంటారు. """/" / అలిపిరి మెట్ల మార్గంలోని మొదటి మెట్టు దగ్గర ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకుని ఆ తర్వాత మెట్ల మార్గం ద్వారా కాలినడకన పవన్ తిరుమల కు చేరుకుంటారు.

  ఈ రోజు రాత్రి తిరుమలలోని విశ్రాంతి భవంలోనే బస చేసి,  రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.

శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి వెంగమాంబ  ప్రసాద కేంద్రాన్ని పవన్ పరిశీలించనున్నారు.పవన్ పర్యటన నేపధ్యంలో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు.

ఇక రేపు సాయంత్రం తిరుపతిలో తలపెట్టిన వార బహిరంగ సభలో( Public Meeting ) పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు ? సుప్రీం కోర్టు  లడ్డు కల్తీ పై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ఏ విషయాలపై మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది  తిరుమల లడ్డు( Tirumala Laddu ) వ్యవహారంలో  """/" / ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టుబట్టిన నేపథ్యంలో పవన్ తిరుపతి సభలో ఏ విధంగా మాట్లాడుతారు అనేది తేలాల్సి ఉంది.

తిరుమల లడ్డు తయారీలో వినియోగించిన నెయ్యి లో కల్తీ జరిగిందనే విషయం లోనే పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు.

దీనిలో భాగంగానే తిరుపతిలోని జ్యోతిరావు పూలే సర్కిల్లో వారాహి సభను నిర్వహించేందుకు జనసేన నాయకులు ఏర్పాట్లు చేశారు.

ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు.ఇప్పటికే వైసీపీ ఎంపీ గురుమూర్తి పవన్ ప్రాయశ్చిత్త దీక్షపైన , తిరుపతి సభ పైన అనేక ప్రశ్నలు స్పందించిన నేపథ్యంలో,  పవన్ వాటికి ఏ విధంగా సమాధానం చెబుతారు ?  అసలు ఏ అంశాలపై మాట్లాడుతారు వైసిపిని ఏ విధంగా టార్గెట్ చేసుకుంటారనేది రాజకీయంగా ఉత్కంఠ కలిగిస్తోంది.

అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్.. ఇంకోసారి అలా అరవద్దంటూ?