తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి
TeluguStop.com
తిరుమల శ్రీవారిని ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.
ఐ.పి విరామ సమయంలో కుటుంబ సమేతంగా నారాయణ స్వామి శ్రీవారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.కలియుగ వేంకటేశ్వర స్వామి కృపా కటాక్షంతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారని, పేద వారి సంక్షేమం కోసం నవరత్నాలు తీసుకొచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్ధికంగా,విద్య, ఆరోగ్య పరంగా సమానత్వం జగన్ చూపుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంను అడ్డు పడుతున్న రాక్షస మనస్తత్వం కలిగిన వారి మనస్సు మార్చి జగన్ కి సపోర్టు చేసే విధంగా వారిలో మార్పు తీసుకుని రావాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు.
ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి పేద కుటుంబం విద్యావంతులు కావాలనే జగన్ కళ నెలవేరాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఇండియా చరిత్రలోనే మూడు సంవత్సరాల పరిపాలన కులం, మతం, పార్టి లేకుండా సంక్షేమ పధకాలు అందిస్తున్నారని, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు గడప గడపకు వైసీపి అనే కార్యక్రమం చేపట్టారని, ప్రతిపక్షాలు అధికార దాహంతో అనవసరంగా అధికార పార్టిపై విమర్శలు, రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.
ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని ఒక మానవ అవతారంగా భావిస్తున్నారని డెప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
అధిక కొలెస్ట్రాల్ వల్ల తలెత్తే సమస్యలేంటి.. కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి?