ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు…. 40 మంది మృతి…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

వైద్య ఆరోగ్య శాఖ తాజాగా కరోనా బాధితుల, మరణాలకు సంబంధించిన హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది.

గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,593 మందికి కరోనా నిర్ధారణ అయింది.కొత్తగా నమోదైన కేసుల్లో 2,584 మందికి రాష్ట్రానికి చెందిన వాళ్లు కాగా 9 మంది ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లని తెలుస్తోంది.

ప్రభుత్వం గత 24 గంటల్లో 22,304 శాంపిల్స్ ను పరీక్షించింది.రాష్ట్రంలో ప్రస్తుతం 19,393 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 18,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కొత్తగా నమోదైన కేసుల్లో తూర్పు గోదావరి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 590 మంది కరోనా బారిన పడగా తూర్పు గోదావరి జిల్లాలో 500 కేసులు నమోదయ్యాయి.

కొత్తగా నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తుండగా పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్చందంగా లాక్ డౌన్ ను పాటిస్తున్నారు.

ఓరి నాయనో.. ఇదేం జీవి.. వీడియో చూస్తే షాకే…