ఏపీ కరోనా అప్‌డేట్.. సెకండ్ వేవ్ తీవ్రత చాలా ఉందట.. ?

గత సంవత్సరం క్రితం దేశంలో అడుగు పెట్టిన కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తుంది.

ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా తీవ్ర రూపందాల్చుతున్నట్లే కనిపిస్తుంది.ఈ క్రమంలో ఏపీలో కూడా భారీ సంఖ్యలో కరోనా కేసులు బయట పడుతున్న విషయం తెలిసిందే.

కాగా ఏపీలో గడచిన 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసుల వివరాలను అక్కడి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వీరి లెక్కల ప్రకారం.ఏపీలో 31,929 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,309 మందికి కరోనా నిర్ధారణ అయిందని అధికారులు తెలియ చేస్తున్నారు.

ఇకపోతే చిత్తూరు జిల్లాలో భారీ స్థాయిలో 740 పాజిటివ్ కేసులు నమోదవగా, కర్నూలు జిల్లాలో 296 కేసులు, గుంటూరు జిల్లాలో 527, విశాఖ జిల్లాలో 391 కోవిడ్ కేసులు బయటపడ్దాయట.

ఇక విజయనగరంలో 97, పశ్చిమ గోదావరిలో 26 కొత్త కేసులు నమోదయ్యాయట.ఇదిలా ఉండగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే కరోనా వల్ల ముగ్గురు మరణించారని వెల్లడించారు.

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. సీఎం జగన్ హాట్ కామెంట్స్