కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ నేత చింతా మోహన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ నేత చింతామోహన్( Chinta Mohan ) కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర స్టార్ట్ చేసి ఏడాది కావటంతో.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) చెందిన నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.

దీనిలో భాగంగా ఏపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సైతం రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పాదయాత్ర ఏడాది పూర్తికావటంతో "ఇంటింటికి కాంగ్రెస్"( Intintiki Congress ) అనే వినూత్న కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు.రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు. """/" / ఈ సందర్భంగా తిరుపతిలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే పనులను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన పలు మంచి పనులు ప్రజలకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ,( YCP ) ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ లపై( TDP ) మండిపడ్డారు.

ఆనాడు అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మోడీ( PM Modi ) హామీ ఇచ్చారు.

ఇప్పటివరకు కనీసం ఇద్దరికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.

దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చింతా మోహన్ విజ్ఞప్తి చేశారు.

విమర్శల పాలవుతున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదం ఫోటో.. మ్యాటరేంటంటే?