ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక నిర్ణయాలు తీసుకుంటూ విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా సీఎం జగన్ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు, బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో వీరికి శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు.

ప్రముఖ శిక్షణా సంస్థలలో ఒకటైన ఎక్స్ఎల్ఆర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుంది.

ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ ఆర్జా శ్రీకాంత్, ఎక్స్ఎల్ఆర్ సంస్థ సీఈవో మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది.

ఎక్స్ఎల్ఆర్ సంస్థ ఇంజనీరింగ్ విద్యార్థులకు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనాలసిస్ లలో శిక్షణ ఇవ్వనుంది.

జగన్ సర్కార్ భవిష్యత్తులో డిమాండ్ కు అనుగుణంగా విద్యార్థులకు కొత్త కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.

ఎక్స్ఎల్ఆర్ సంస్థ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు సైతం శిక్షణ ఇచ్చి వాళ్లలో నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేస్తోంది.

ఎక్స్ఎల్ఆర్ సంస్థ ఇప్పటికే పలు కాలేజీల్లోని అధ్యాపకులకు శిక్షణ ఇవ్వగా మిగిలిన విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇస్తోంది.

వేగంగా ఉపాధి కల్పించే విధంగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఏ సర్కార్ చేపట్టని విధంగా జగన్ సర్కార్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని అభిప్రాయపడుతున్నారు.

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 4,00,000కు పైగా నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

నిరుగ్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా జగన్ సర్కార్ చర్యలు చేపడుతుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

తెల్లటి మెరిసే చర్మం కోసం బెస్ట్ ఫ్రూట్ మాస్క్ ఇది.. కచ్చితంగా ప్రయత్నించండి!