ఖమ్మంలో షర్మిల ఏం చేస్తున్నారంటే.. ?

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతుంది.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల ఇప్పటికే నూతన పార్టీ పెట్టడానికి రంగం సిద్దం చేసుకుంటుందట.

కాగా మంగళవారం షర్మిల, వైఎస్ అభిమానులతో లోటస్ పాండ్ లో సమావేశమై తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని, పార్టీ గురించి త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల తన నెక్స్ట్ టార్గెట్‌గా ఖమ్మంను ఎంచుకున్నారు.

ఇందులో భాగంగా నెల 21న ఖమ్మంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారట.

కాగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుందని తెలిపారు.

ఇక షర్మిల కొత్త పార్టీ ప్రారంభం అయితే తెలంగాణాలో ఊహించని రాజకీయ విపత్తులు సంభవించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అంచనా వేస్తున్నారట.

‘కిస్సిక్’ డ్యాన్స్ చేస్తే అమ్మ దెబ్బలు కొడుతుంది.. శ్రీలీల సంచలన వ్యాఖ్యలు !