వైసీపీ నేతలకు ఏపీ సీఎం జగన్ పిలుపు

ఏపీలోని వైసీపీ నేతలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు.వరద ప్రాంతాల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.కాగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.భారీగా వరద నీరు చేరడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని, ప్రజలకు సాయం అందించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

కలికాలం.. భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. వీడియో వైరల్!