నో టికెట్ జాబితాలో రోజా తో పాటు వీరంతా ?

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) అకస్మాత్తుగా సంచలన నిర్ణయాలకు తెర తీశారు.

  ముఖ్యంగా పార్టీని ప్రక్షాళన చేయాలని భావించిన జగన్ ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పైన దృష్టి సారించారు.

వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి ?  ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో( Sitting MLAs ) ఎవరిని తప్పించాలనే విషయంపై ఒక క్లారిటీ కి వచ్చారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల పని తీరుపై జనాల్లో అసంతృప్తి ఉండడం,  వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్లు ఇచ్చినా గెలిచే అవకాశం ఉండదని సర్వే నివేదికలతో జగన్ అలెర్ట్ అయ్యారు.

ఈ మేరకు భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు ఇప్పటికే 11 మంది వైసిపి నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చారు.

ఈ జాబితాలో ప్రస్తుత మంత్రులతో పాటు , జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు.

ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యేల్లో దాదాపు 50 మంది సిట్టింగ్లకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారట.

42 మంది ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలే కాకుండా, వేరే నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించి, అక్కడ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట.

"""/" / ఇదే క్రమంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,( Alla Ramakrishna Reddy ) గాజువాక ఇంచార్జి దేవన్ రెడ్డి( Devan Reddy ) లు తమ పదవులకు రాజీనామా చేశారు.

 చాలామంది మంత్రులు, మాజీ మంత్రులు ఇతర కీలక నాయకులు ఉన్నారట.ముఖ్యంగా ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా కు( Minister Roja ) సైతం టికెట్ ఛాన్స్ లేనట్లుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

 రోజానే కాకుండా ఆదిమూలపు సురేష్( Adimulapu Suresh ) పేర్ని నాని( Perni Nani ) బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivas Reddy ) వంటి వారికి టిక్కెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారట.

"""/" / తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.

అక్కడ బీఆర్ఎస్ గెలుపు ధీమాతో ఉండడం , సిట్టింగ్ ఎమ్మెల్యేలకే దాదాపుగా టికెట్లు కేటాయించడంతో ప్రజల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

  బిఆర్ఎస్ ఓటమికి కారణమైందని, తాను కూడా మొహమాటాలకు వెళ్లి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తే , ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న  వారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని , అటువంటి వారికి టికెట్ ఇవ్వడం వల్ల నష్టమే తప్ప కలిసి వచ్చేది ఉండదని, జగన్ అంచనా వేస్తున్నారట.

ప్రస్తుతం వైసీపీలో చోటుచేసుకుంటున్న ఈ మార్పు, చేర్పుల వ్యవహారం తీవ్ర గందరగోళాన్నే సృష్టిస్తున్నాయి.

మహేష్ బాబుతో ఆ సినిమా చేసి తప్పు చేశాను.. శ్రీనువైట్ల సంచలన వ్యాఖ్యలు!