టీడీపీ నేతల బూతులకి కారణాలు చెప్పిన జగన్ 

టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన ఘాటు విమర్శలు.

దానికి వైసీపీ శ్రేణులు టిడిపి కార్యాలయాలపై దాడులు జరగడం తదితర పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఈ రోజు వైసిపి శ్రేణులు దాడికి నిరసనగా తెలుగుదేశం పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది.

వైసిపి వ్యతిరేక పార్టీలన్నీ మూకుమ్మడిగా ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం పైన, జగన్ పైన విమర్శలు చేస్తూ ఉండటం,  దానికి వైసీపీ మంత్రులు,  ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.

అయితే ఈ పరిణామాలపై తాజాగా ఏపీ సీఎం జగన్ స్పందించారు.తెలుగుదేశం పార్టీ నేతలు తనను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుండడం పైన ఆయన స్పందించారు.

        ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే టిడిపి నేతలు బూతులు తిడుతున్నారు అని జగన్ వ్యాఖ్యానించారు.

  ఎవరు మాట్లాడని బూతులు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని జగన్ మండిపడ్డారు.ఆ బూతు లను జీర్ణించుకోలేక నన్ను ప్రేమించే వాళ్ళు,  అభిమానించే వాళ్ళు రియాక్షన్ చూపించారని,  దాని ప్రభావం రాష్ట్రంలో కనబడిందని, కానీ రెచ్చగొట్టి వైషమ్యాలు సృష్టించి,  రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు అంటూ టిడిపి నేతలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు.

  మీ చల్లని దీవెనలతో రెండేళ్ల పాలన అద్భుతంగా సాగిందని  ప్రజలను ఉద్దేశించి జగన్ చెప్పుకొచ్చారు.

  """/"/     ఇదే సమయంలో కొంతమంది కావాలనే కులాల మధ్య , మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు.

ప్రజలకు ఎలాంటి మేలు జరగకూడదు ప్రభుత్వ పథకాలు అమలు కాకూడదు.అలా జరిగితే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

సీఎం జగన్ కు మంచి పేరు వస్తుంది.తమ కు మనుగడ ఉండదు అనే భయంతోనే వాటిని అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు .

వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు ఉద్దేశించి జగన్ కౌంటర్ ఇచ్చారు.

MLA Danam Nagendar : ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ