జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..!!
TeluguStop.com
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు.2021-22 సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10143 పోస్టులను భర్తీ చేసే రీతిలో జగన్ ప్రభుత్వం రెడీ అయ్యి క్యాలెండర్ రెడీ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో జూలై నెలలో1238 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదేరీతిలో ఆగస్టు నెలలో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టు కి చెందిన 36 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇక సెప్టెంబర్ మాసంలో పోలీస్ శాఖకు సంబంధించి 450 పోస్టులను, అక్టోబర్ మాసంలో వైద్య శాఖలో 451 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది.
"""/" /
అంత మాత్రమే కాక నవంబర్ మాసంలో పారామెడికల్ పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకోనుంది.
ఇక డిసెంబర్ మాసంలో 441 నర్సుల పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం రెడీ అయ్యింది.
వచ్చే సంవత్సరం జనవరి మాసంలో 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులను ఫిబ్రవరి నెలలో వివిధ యూనివర్సిటీలకు చెందిన రెండువేల అసిస్టెంట్ పోస్టులను మార్చిలో వివిధ శాఖలకు చెందిన 36 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ .అవినీతికి తావు లేకుండా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని తెలిపారు.
రాత పరీక్షల విద్యా విధానం ద్వారా మెరిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాల భర్తీ విధానం ఉంటుందని తెలియజేశారు.
ఏ నెలలో ఏ ఏ ఉద్యోగాలు కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనే దానిపై అవగాహన ఉండేవిధంగా ఈ క్యాలెండర్ క్రిస్టల్ క్లియర్ గా రూపొందించినట్లు సపష్టం చేశారు.
.
ఆట మొదలెట్టిన డొనాల్డ్ ట్రంప్ .. 7.25 లక్షల మంది భారతీయులు ఇంటికే?