అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ పై కౌంటర్ వేసిన జగన్

ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకోవడం తోనే మొదటి రోజు సభ మొదలైంది.

ఇక ఈ సభలో ముఖ్యమంత్రి జగన్ మహిళల భద్రత గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని అందరు అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా ముఖ్యమంత్రి జగన్ మీద విమర్శల దాడి చేస్తున్నారు.

ఏదో ఒక సమస్యని తెర మీదకు తీసుకువచ్చి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్నారు.

అదే సమయంలో వైసిపి పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శల దాడి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో జగన్ కూడా పవన్ కళ్యాణ్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మహిళల భద్రత గురించి మాట్లాడుతూ కొంతమంది పెద్ద పెద్ద నాయకులు తమకు ముగ్గురు నలుగురు పిల్లలు కావాలని మాట్లాడుతున్నారని అయితే తనకు మాత్రం ఒక్కరే భార్య అంటూ వ్యాఖ్యానించారు.

దిశా సంఘటన చూసిన తర్వాత అత్యాచారం చేసిన నిందితులను కాల్చి చంపినా తప్పులేదని అందరూ భావించారని అన్నారు.

తనకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారని, అందుకే మహిళల భద్రత విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.

దీని కోసం తాను కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ ని జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు అయిందని రాజకీయ వర్గాల్లో చెప్పుకున్నారు.

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్