తెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
TeluguStop.com
రేపు కొత్త ఏడాది 2024లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
2024 సంవత్సరంలో ప్రతి ఇంటా ఆనందాలు, అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలన్న సీఎం జగన్ అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
కలబందతో హెయిర్ గ్రోత్ సీరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?