ఢిల్లీలో ఏపీ సీఎం జగన్.. సాయంత్రం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‎తో భేటీ

ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లారు.ఇందులో భాగంగా సాయంత్రం 6.

30 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆయన భేటీకానున్నారు.

ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల విడుదలపై సీఎం జగన్ చర్చించనున్నారు.రేపు విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

తరువాత రేపు రాత్రి అమిత్ షాతో జగన్ సమావేశం కానున్నారు.ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థికసాయంతో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు వంటి పలు అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

సుంకాల యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొడుతోన్న కెనడా నేత