జగన్ ను సి‌ఎం పీఠం నుండి దించాలని సుప్రీం లో పిటిషన్

ఏపీ సి‌ఎం జగన్ కు సుప్రీమ్ కోర్ట్ లో ఊరట లభించింది.గతంలో సుప్రీం కోర్ట్ జడ్జ్ జస్టిస్ ఏన్వి రమణపై సి‌ఎం జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అప్పట్లో ఆ విషయంపై న్యాయమూర్తులు జగన్ పై మండిపడ్డారు.ఇటీవలే జగన్ మరోసారి ఇదే విషయం పై సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు లేఖ రాయడం అది మీడియా ద్వారా విడుదల కావడంతో జగన్ న్యాయవ్యవస్థ ధిక్కారణకు పాల్పడాడని, జీఎస్ మణి, ప్రదీప్ కుమార్, ప్రదాన న్యాయవ్యవస్థలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాకలు చేశారు.

జగన్ సి‌ఎం పదవిలో ఉండటానికి అర్హుడు కాదని.ఆయనను ఆ పదవినుండి వెంటనే తొలగించాలని అందులో పేర్కొన్నారు.

దీనిపై విచారణ చేపడుతూ.జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, దినేశ్ మహేశ్వరి, హృషికేశ్ రాయ్ లతో త్రిసభ్య ధర్మాసనం విచారణకు సిద్దం అయ్యింది.

పిటిషనర్లను ప్రశ్నిస్తూ.మీ పిటిషన్లు పరస్పరం విరుద్దంగా ఉన్నాయి ఓ సి‌ఎం ను తొలగించమనే అంశానికి, విచారణకు సంబందం లేదు అయిన మీడియా లో వార్తలను చూసి పిటిషన్లు ఎలా వేస్తారని ప్రశ్నించింది.

సిజేఐ కు జగన్ రాసిన లేఖ మరో ధర్మాసనం పరిశీలనలో ఉన్నదని తెలిపింది.

జగన్ లేఖ వ్యవహారంలో మొత్తం మూడు పిటిషన్లు రాగా రెండింటిని కొట్టివేసింది. """/"/ H3 Class=subheader-styleసునీల్ కుమార్ సింగ్/h3p ఇదే అంశంపై దాకలు చేసిన పిటిషన్ ను గతంలో ఏపీ ప్రభుత్వం అప్పీల్ చేసిన పిటిషన్ తో జత చేసి విచరణ చెప్పటింది.

సుప్రీమ్ కోర్టు పైన ,సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులపైన ఇలాంటివి జరగకుండా చూడాలని పేర్కొన్నాడు.

అదే విదంగా న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థపై అసభ్య కర వ్యాఖ్యలు చెయ్యడం రాజ్యాంగంలోని 121 ఆర్టికల్ ను ఉల్లంగించడమే అవ్వుతుందని.

పార్లమెంట్ లో అయిన సరే న్యాయవ్యవస్థపై మాట్లాడే అర్హతలేదని ఆయన దాకలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నాడు.

ఈ అంశంపై మరో న్యాయవాది ముక్తి సింగ్ వివరణ ఇస్తూ గతంలో నంబూద్రిప్రసాద్ కేస్ లో ఓ సి‌ఎం ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదనే విషయం నిరూపితమైన సంగతి తెలిసిందే.

దీనిపై త్రిసభ్య ధర్మాసనం స్పందిస్తూ కొట్టేసిన రెండు పిటిషన్లపై వివరణ ఇస్తూ పత్రిక లో వచ్చిన వార్తలను అందులో ఉన్న అంశాలను ఎరుకుని మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి.

కానీ అది ఇలా చెయ్యాలిసిన విషయం కాదు.ఇలా చేసుకుంటూ పోతే అంతులేకుండా పోతుందని వివరించింది.

చెంపలపై మొటిమలు మచ్చలు అస్స‌లు పోవడం లేదా.. అయితే ఇదే మీకు బెస్ట్ సొల్యూషన్!