వైఎస్ షర్మిలపై ఏపీ సీఎం జగన్ పరోక్ష సెటైర్లు..!!
TeluguStop.com
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila )పై సీఎం జగన్ పరోక్షంగా విమర్శలు చేశారు.
అనంతపురం( Anantapur ) జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
"""/" /
రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం, చంద్రబాబు( Chandrababu )ను జాకీ పెట్టి ఎత్తేందుకు మరి కొంతమంది స్టార్ క్యాంపెయినర్లు ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్( CM Jagan ) అన్నారు.
అలాగే చంద్రబాబు ప్రయోజనాల కోసం బీజేపీలో తలదాచుకున్న పసుపు కమలాలు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని చెప్పారు.
ఏ మంచి చేయకుండా కేవలం మోసాలే చేసిన చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు.
చంద్రబాబును భుజాన వేసుకుని తిరిగే ముఠానే ఈ స్టార్ క్యాంపెయినర్లని విమర్శించారు.జెండాలు జతకట్టడమే వాళ్ల ఎజెండా అన్న సీఎం జగన్ జనాల గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అని స్పష్టం చేశారు.
అలాగే జనమే తనకు స్టార్ క్యాంపెయినర్లని తెలిపారు.
మహా కుంభమేళా 2025 : ఎన్ఆర్ఐల కోసం యోగి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు