తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి ఏపీ సీఎం జగన్ అభినందనలు
TeluguStop.com
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి ఏపీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఇతర మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.
ఈ ఆహారాలు తింటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుదట.. తెలుసా?