బాబు కి ఫైలెట్ అవ్వాలని ఉందట !

తెలంగాణ ఆంధ్రా రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరో బాధ్యత నెత్తిమీద పెట్టుకోవాలనుకుంటున్నాడట.

తనకు ఫైలెట్ అవ్వాలని ఉంది అంటూ బాబు వ్యాఖ్యానించారు.అసలు సంగతి ఏంటి అంటే.

? .విజయవాడ ప్రకాశం బ్యారేజీ వేదికగా ఆదివారం నిర్వహించిన విమాన విన్యాసాలు తిలకించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.

విమాన విన్యాసాల్లో అంతర్జాతీయంగా పేరున్న గ్లోబల్ స్టార్ సంస్థ ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇటీవలే సోషల్ మీడియా సమ్మిట్, ఎఫ్ 1 బోట్ రేసింగ్ విజయవాడలో నిర్వహించామని వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు.

బోట్ రేసింగ్ పోటీలకు ఇంతటి అనువైన ప్రాంతం ప్రపంచంలో ఎక్కడా లేదని సీఎం అభిప్రాయపడ్డారు.

అమరావతిలో ప్రజలకు నిత్యం వినోదం, ఆహ్లాదం పంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.కార్యక్రమం చూస్తుంటే తనకూ పైలట్‌ కావాలన్న కోరిక కలుగుతోందని సరదాగా వ్యాఖ్యానించారు.

Validation Check 2026-03-24 10:38:07