ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు( CM Chandrababu Naidu ) పోలవరం పర్యటన ఖరారు అయింది.

ఈ నెల 17న పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) సందర్శించనున్నారు.గత ఐదేళ్లుగా పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయింది.

? ఐదేళ్లలో నిర్మాణం జరిగిన తీరు సహా పలు అంశాలను పరిశీలించనున్నారు.అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన పనులపై చర్చించనున్నారు.

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనపరంగా చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇదే సమయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

"""/" / తనను కలవటానికి వచ్చే ప్రజా ప్రతినిధులను మరియు ప్రజలను ఎట్టి పరిస్థితులలో అడ్డుకోవద్దని శనివారం పోలీసులను హెచ్చరించారు.

సీఎం హోదాలో తొలిసారి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి( Mangalagiri TDP Office ) వచ్చిన క్రమంలో చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ కార్యాలయంలో భారీ కేడ్లు ఏర్పాటు చేయటాని తప్పు పట్టారు.పార్టీ కార్యాలయంలో భారీ కేడ్లు పెట్టడం ఏంటి అని నిలదీశారు.

దయచేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దు.నాకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు.

ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తాం.నిర్దిష్ట సమయంలో ఇవి పరిష్కారం అయ్యేలా చూస్తాం.

ప్రజా విన్నతుల స్వీకరణకు సమయం కేటాయిస్తా అని సీఎం చంద్రబాబు వెల్లడించడం జరిగింది.

బన్నీ ఇంటికి వెళ్లిన సెలబ్రిటీలు ఆ మహిళ ఇంటికి వెళ్లగలరా.. నెటిజన్ల సూటిప్రశ్న వైరల్!