నేడు ఢిల్లీకి చంద్రబాబు ! అమిత్ షా కరుణిస్తారా ? 

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ( AP CM Chandrababu )నేడు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరనున్న చంద్రబాబు ఈరోజు రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు.

అంతకంటే ముందుగా ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది .

ఈ సమావేశంలోనే అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు .ఆ సమావేశం అనంతరం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా( Amit Shah ) తో చంద్రబాబు భేటీ అవుతారు.

  ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతోనూ ఏపీ కి సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు.

"""/" / అమిత్ షా తో బేటి సందర్భంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపైనే ప్రధానంగా చర్చించనున్నారు.

  అలాగే విభజన సమస్యల పరిష్కారం కోరుతూ.  కేంద్రం నుంచి పెండింగ్ నిధుల విడుదల అంశం పైన చర్చించనున్నారు.

  ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని,  వాటి విషయంలో కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారట.

  అలాగే గత వైసిపి ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలు, వాటిపై విచారణ అంశం పైన చంద్రబాబు అమిత్ షా కు వివరించనున్నారట.

ఏపీ విషయంలో కేంద్రం సానుకూల వైఖరితో స్పందించాలని, అలాగే రాజధాని అమరావతి ( Amaravati )నిర్మాణానికి కేంద్రం తగిన సహకారం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారట .

"""/" /  ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు కు అన్ని విధాలుగా సహకరిస్తామని అప్పట్లో బీజేపీ నేతలు చెప్పిన నేపథ్యంలో , ఇప్పుడు వాటిపై చొరవ చూపించాలని చంద్రబాబు అమిత్ షాను కోరనున్నారట.

ఏపీకి నిధుల విడుదల తో పాటు , అమరావతి, పోలవరం తదితర అంశాలపైనే ప్రధానంగా చంద్రబాబు చర్చించునున్నట్లు సమాచారం.

చంద్రబాబు ఢిల్లీ టూర్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

మనుషులను చంపే తోడేలు కిరణ్ అబ్బవరం.. క మూవీ టీజర్ వేరే లెవెల్ లో ఉందిగా!