ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..!!
TeluguStop.com
ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకపక్క పాలన మరోపక్క ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.
దీనిలో భాగంగా ఇప్పటికే మెగా డిఎస్సి, పింఛన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి హామీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అదేవిధంగా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లను కూడా మార్చడం జరిగింది.
ఇక ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
"""/" /
విషయంలోకి వెళ్తే వెలగపూడిలోని సచివాలయ ఉద్యోగులు,( Secretariat Employees ) హెచ్ఓడీలకు వారానికి ఐదు రోజుల పనిదినాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు విధులు నిర్వహించాలని ఆదేశించారు.నేటి నుంచే ఆదేశాలు అమల్లోకి వస్తాయని గురువారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
గతంలో ఏపీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని( AP Secretariat ) అమరావతికి తరలించారు.
ఆ సమయంలో వారాంతంలో ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి రావడానికి వీలుగా చంద్రబాబు అప్పట్లో ఈ ఐదు రోజుల పని విధానాన్ని తీసుకురావడం జరిగింది.
ఆ తర్వాత జగన్ ప్రభుత్వం కూడా దాన్నే కొనసాగించింది.ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకు అంగీకరించారు.
మరో ఏడాది పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలపడం జరిగింది.
వింటర్ లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడే పండ్లు ఇవే..!