మాజీ మంత్రి నారాయణ నివాసానికి ఏపీ సీఐడీ..!

మాజీమంత్రి నారాయణ నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు రానున్నారు.అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన సతీమణిని సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

అదేవిధంగా బినామీ ప్రమీల, రామకృష్ణ హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానిని సైతం విచారించే అవకాశం ఉంది.

అయితే నారాయణ కుమార్తెలు శరని, సింధూర నివాసాలతో పాటు నారాయణకు చెందిన సంస్థలో ఇప్పటికే సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో అధికారులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.

డాకు మహారాజ్ ప్రమోషన్స్ విషయంలో అసంతృప్తిలో అభిమానులు.. రికార్డులు క్రియేటవుతాయా?