చంద్రబాబు ఇంటిని జప్తు చేసేందుకు ఏపీ సీఐడీ పిటిషన్

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

గుంటూరు జిల్లా ఉండవల్లిలో కరకట్ట రోడ్డు దగ్గర చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఇంటిని జప్తు చేయాలనే యోచనలో ఉంది సీఐడీ.

ఈ మేరకు నాలుగు రోజుల క్రితం పిటిషన్ వేసింది.కాగా ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఇవాళ విచారణ చేపట్టి తీర్పును వెలువరించనుంది.

చంద్రబాబు నివాసం వద్దకు ఓ వైపు పార్టీ శ్రేణులు చేరుకుంటూ ఉండగా మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు.

అయితే కరకట్ట దగ్గర ఉన్న చంద్రబాబు నివాసంపై గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

నిబంధనలకు విరుద్దంగా ఇంటిని నిర్మించారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

కేసు విషయం లో అల్లు అర్జున్ మీద ఉచ్చు బిగుస్తోందా.? ఆయన అరెస్టు అవ్వబోతున్నారా..?